అబ్బాయి మంచివాడని, అబ్బాయికి ఎటువంటి చెడు అలవాట్లు లేవని, ఉద్యోగం (Job) చేస్తాడని ఈ విధంగా పలు అబద్ధాలు చెప్పి అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేసే ప్రయత్నం చేస్తారు. పెళ్లికి ముందు అమ్మాయి తనకు కాబోయే భాగస్వామి గురించి ఎన్నో కలలు కంటుంది. పెళ్లి తర్వాత భర్త నిజస్వరూపం (Reality) తెలిసి తాను కన్న కలలు అన్నీ వృధా అని దిగులు చెందుతుంది. భర్తను మార్చే ప్రయత్నం చేసినా తను మారడానికి ప్రయత్నించడు.